About us

పరిచయం
ప్రియమైన నా వెలమ బంధువులకు నమస్కారం.

    బి. జి. నాయుడు అను నేను గత 25 సంవత్సరాలుగా (1998) వెలమ వివాహ వేదిక (విశాఖ మ్యారేజ్‌ లైన్స్‌) నడుపుచున్నాను. అలాగే 2003 మే 25న విశాఖపట్నం వెలమభవన్‌ (సెంట్రల్‌ ఆర్గనైజేషన్‌ బిల్డింగ్‌) లో వెలమవిజయం పత్రికను ప్రారంభించి, విజయవంతంగా నడపటం జరిగింది. అయితే మారిన సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నేడు వెలమవిజయం పత్రిక బదులుగా వెలమసామాచార్‌ (వెలమవిజయం) అనే డిజిటల్‌ పత్రిక మరియు యూట్యూబ్‌ ఛానల్‌ను వాట్సాప్‌ మరియు సోషల్‌ మీడియా గ్రూప్‌లను నడుపుతున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము.
    అదేక్రమంలో సమస్థ వెలమ సమాచారాన్ని నేటి వర్తమాన తరాలకు, భవిష్యత్‌ తరాలకు అందించాలన్న ఆకాంక్షతో ఈ వెలమసమాచార్‌.కామ్‌ వెబ్‌సైట్‌ను ప్రారంభించడం జరిగింది. ఈ వెబ్‌సైట్‌లో గత చరిత్రలను, వర్తమాన చరిత్రలను, విశేషాలను అందించాలని ఆశిస్తున్నాము. అనివార్యకారణాలవలన ఇంతవరకు పూర్తి స్థాయిలో అందించలేకపోయినా ఇకనుండి ఎప్పటికప్పుడు జాతి విశేషాలను అందించడానికి కృషిచేస్తామని తెలియజేస్తున్నాం. అలాగే వెలమసమాచార్‌ యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా కూడా ఇప్పటికే కొంతమంది ప్రముఖుల చరిత్రలను అందించడం జరిగింది. భవిష్యత్‌లో మరింత సమగ్ర సమాచారాన్ని జాతి జనుల ముందుకు తేగలమని తెలియజేస్తున్నాం.
    మేము చేసే ఈ జాతి సమాచార యజ్ఞంలో నేనుసైతమని ప్రతీఒక్కరూ పాలుపంచుకుంటారని ఆశిస్తున్నాం. అలాగే మీ మీ సహాయ సహకారాలను సమాచార రూపంలోనూ, ఆర్ధిక సహాయ సహకారాలు అందించడంద్వారా మీ యొక్క నైతిక మద్దతును తెలియజేస్తారని ఆకాంక్షిస్తున్నాం.
                                                                          ఇట్లు
                                                              మీ. . .  బి. జి. నాయుడు
                                              ఎడిటర్‌, వెలమసమాచార్‌, శ్రీ వెలమవిజయం.
                                                  ఫోన్‌ : 9246670571, 9298052443.

QUICK MENU
Velama Vijayam Magazine
Community Information
Send Community Information
Velama Matrimony
Services
Register Your Information
Picture Gallery
Video Gallery
Contact us
 
ADVERTISEMENTS
peditnti ammailaku vuchita vivahalu
వెలమ జాతి చరిత్ర  ముఖ్యమైన చాప్టర్స్
velama vivaha vedika
vilama story title
velama samajaniki viznapthi
 
Powered by Kalyan Infotech
Copyrights © Velama Samachar, All Rights Reserved