ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గంలోకి కొత్తగా 14 మందిని మంత్రులుగా తీసుకొన్నారు. వారిలో మన వెలమ శ్రేయోభిలాషి, అనకాపల్లి జిల్లా మాడుగల ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు కూడా ఒకరు. నేడు మంత్రి పదవి చేపట్టబోతున్న ఆయనకి యావత్ వెలమజాతి తరపున వెలమసమాచార్ శుభాకాంక్షలు తెలియజేస్తోంది. బూడి ముత్యాల నాయుడు 1962, జూలై 14న తారువా గ్రామంలో రమణమ్మ, వెంకునాయుడు దంపతులకు జన్మించారు. వెంకునాయుడు 35 ఏళ్ళపాటు తారువా సర్పంచ్‌గా పనిచేశారు. బూడి ముత్యాల నాయుడు ఇంటర్మీడియెట్ వరకు చదువుకొన్న తరువాత రాజకీయాల వైపు ఆకర్షితులై 1984లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దేవరాపల్లి మండలం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రచారదళ్ జాయింట్ కన్వీనరుగా, దేవరాపల్లి మండల అధ్యక్షుడిగా, మాడుగుల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీకి విశేషమైన సేవలందించారు. 1988లో తారువా గ్రామ ఉపసర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టి 1991 వరకు సేవలందించారు. ఆ తరువాత 1995 నుంచి 2001 వరకు తారువా గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. ఆ తరువాత వరుసగా 2001-2006 దేవరాపల్లి జెడ్పీటీసీ సభ్యుడిగా, 2006-2008 కొత్తపెంట ములకలాపల్లి ఎంపీటీసీ సభ్యుడిగా, 2008-2011 మద్య కాలంలో దేవరాపల్లి ఎంపీపీగా సేవలందించారు. బూడి ముత్యాల నాయుడు రాజకీయ ప్రస్థానంలో 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పెద్ద మలుపు తిరిగిందని చెప్పవచ్చు. తొలుత రెండేళ్ళపాటు మాడుగుల నియోజకవర్గం పార్టీ సమన్వయకర్తగా పనిచేస్తూ పార్టీని బలోపేతం చేశారు. ఆయన సేవలను, రాజకీయ సామర్ధ్యాన్ని గుర్తించిన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి 2014లో మాడుగుల నుంచి పార్టీ టికెట్ కేటాయించగా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొంటూ ఘనవిజయం సాధించారు. మళ్ళీ 2019 శాసనసభ ఎన్నికలలో మాడుగుల నుంచి మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పుడే ఆయనకి మంత్రి పదవి లభిస్తుందని అందరూ భావించారు కానీ ప్రభుత్వ విప్ పదవి లభించింది. ఇప్పుడు మంత్రి పదవి చేపట్టబోతున్నారు. తన స్వయంశక్తి, కృషి, పట్టుదలతో గ్రామ ఉపసర్పంచ్ స్థాయి నుంచి రాష్ట్ర మంత్రి స్థాయికి ఎదిగిన బూడి ముత్యాల నాయుడుగారికి శుభాకాంక్షలు.
BG Naidu Editor:
velamasamachar/velama vijayam
9246670571
Director:
వెలమ వివాహ వేదిక &విశాఖ మ్యారేజ్ లైన్స్
|