తెలంగాణ ప్రభుత్వం ఇటీవల అనేక ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌లను విడుదల చేసింది. తెలంగాణ యువత మరియు ఔత్సాహిక అభ్యర్థులందరికీ ఇది ఒక మంచి అవకాశం. ప్రభుత్వ ఉద్యోగాల్లో మన వెలమ సామాజికవర్గానికి చాలా తక్కువ ప్రాతినిధ్యం ఉన్నది. శ్రీ తానిపర్తి భాను ప్రసాద్ రావు, MLC గారి నేతృత్వంలోని మన అఖిల భారత వెలమ సంఘం (AIVA) ప్రభుత్వ ఉద్యోగాలలో వెలమల ప్రాతినిధ్యం పెంచాలని సంకల్పించింది.రాబోయే పరీక్షలకు బాగా సన్నద్ధం కావడానికి మన వెలమ కమ్యూనిటీ కి చెందిన ఔత్సాహిక అభ్యర్థులకు అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలను అందించాలని అధ్యక్షులు శ్రీ తానిపర్తి భాను ప్రసాద్ రావు గారు ప్రతిపాదించారు. అభ్యర్థులకు శిక్షణ, మార్గదర్శకత్వం మరియు వసతిని అందించడానికి అవసరమైన మార్గదర్శకాలను AIVA ఎగ్జిక్యూటివ్ కమిటీ రూపొందిస్తోంది. స్క్రీనింగ్ పరీక్ష ను నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఉచిత శిక్షణ, వసతి మరియు మెస్ సౌకర్యం అందించబడుతుంది. స్క్రీనింగ్ పరీక్ష తేదీలను త్వరలో ప్రకటించనున్నారు. దయచేసి మన కమ్యూనిటీ కి చెందిన ఔత్సాహిక అభ్యర్థులందరికీ ఈ సందేశం అందించండి. పరీక్ష తేదీ మరియు ఇతర సంబంధిత సమాచారం కోసం AIVA కార్యాలయం లో సంప్రదించవచ్చు. నిపుణులైన వారిచే పేరున్న కోచింగ్ సంస్థలలో కోచింగ్ ఇప్పించబడును 9063668353
BG Naidu Editor:
velamasamachar/velama vijayam
9246670571
Director:
వెలమ వివాహ వేదిక &విశాఖ మ్యారేజ్ లైన్స్
|