ఎంత దూరపు ప్రయాణమైనా... ఒక్క అడుగుతో మొదలవుతుంది. అలాగే... ఎంత గొప్ప విజయమైనా చిన్న ఆలోచనతోనే మొదలవుతుంది. ఇండియాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేది అసాధారణ విజయంగానే చెప్పుకోవాలి. ఒకప్పుడు దేశం మొత్తానికీ స్వాతంత్య్రం వచ్చినా... నిజాం పాలనలోని తెలంగాణ ప్రాంతంలో మాత్రం స్వాతంత్య్రం రాలేదు. దానికోసం అప్పట్లో ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారు. అలా నిజాం పాలన నుంచి విముక్తి పొందినా... ఆ తర్వాత కూడా తెలంగాణ ప్రజల తలరాతలు మారలేదు. ఏళ్లుగా తమ హక్కుల కోసం పోరాడారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమ కెరటం అయ్యారు. ఫలితంగా దేశంలో సరికొత్త తెలంగాణ రాష్ట్రం అవతరించింది. కోటి రతనాల వీణ.. విజయ స్వరాలు పలికించింది.
2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇది దేశంలో 29వ రాష్ట్రం. యువ రాష్ట్రం. ప్రతి సంవత్సరం జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది . ఈ సందర్భముగా యావత్ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య కారకులైన కేసీఆర్ గారికి, టిఆర్ఎస్ నాయకులకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. |