ఒకనాడు ప్రత్యేక తెలంగాణాకై అనితరసాధ్యమైన పోరాటం చేసి తమదైన ప్రత్యేక పందాతో, వ్యూహంతో మేనమామ కెసిఆర్తో కలిసి తెలంగాణ ఆవిర్భావానికి నేనుసైతం అని క్షేత్రస్థాయిలో ప్రత్యేక తెలంగాణా కోసం కృషిచేసిన తెలంగాణా పోరాట యోధుడు తన్నీరు హరీష్రావు గారు. మామకు తగ్గ అల్లుడుగా తెలంగాణా క్షేత్రస్థాయిలో తనదైన వాడి, వేడి వాక్ఛాతుర్యంతో ప్రజలను చైతన్యపరిచి ప్రత్యేక తెలంగాణా ఉద్యమంవైపు ప్రజలు ఆకర్షింపబడేవిధంగా ప్రత్యేక కృషిసల్పిన ఉద్యమకారుడు హరీష్రావు. మాటలో స్పష్టత, భాషపై, భావ వ్యక్తీకరణపై ప్రత్యేక పట్టుసాధించిన వ్యక్తి హరీష్రావు. 2001 టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి తెలంగాణ అంతా సుడిగాలి పర్యటన చేసి, తెలంగాణ ప్రజలతో మమేకమై మా హరిన్న అన్న నామంతో ప్రజల గుండెల్లో ప్రేత్యక స్థానాన్ని ఏర్పరచుకున్న వ్యక్తిగా, తెలంగాణ శక్తిగా తెలంగాణ ప్రజహృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి హరీష్రావు గారు. కాలపరిణామ క్రమంలో టిఆర్ఎస్ పార్టీ కాంగ్రేస్తో పొత్తుపెట్టుకొని 2004 సం.లో జరిగిన పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో నాటి కేంద్ర మంత్రి నేటి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి మరియు కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి రెండుచోట్ల విజయబావుట ఎగురవేసారు. ఆ తరువాత సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గానికి రాజీనామా చేయటం జరిగింది. ఆ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ ప్రచార బాధ్యతను నిర్వహిస్తూ పార్టీకి వెన్నెముఖగా ఉన్న టి.హరీష్రావును తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధిగా నిలపడం జరిగింది. అప్పటికే రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వంలో రాష్ట్ర యువజన సర్వీసుల శాఖామాత్యులుగా శ్రీ హరీష్రావుగారు ఉన్నారు. హోరాహోరీగా జరిగిన ఈ ఉప ఎన్నికల్లో తన ప్రత్యర్ధి తెలుగుదేశం అభ్యర్ధి ముత్యంరెడ్డిపై అత్యధిక మెజార్టీతో గెలుపొంది ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు హరీష్రావుగారు. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలన్నీ నెరవేర్చేందుకు అహర్నిశలు కృషి చేస్తూనే, రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో రాష్ట్ర యువజన సర్వీసుల శాఖామాత్యులుగా, పలు పథకాలను అమలు పరిచారు. పథకాలను ఒక సమగ్ర ప్రణాళికతో అమలుపరిచిన తీరు శ్రీ హరీష్రావులో గల పట్టుదల, సునిశిత పరిశీలనా శక్తికి నిదర్శనంగా నిలిచాయి. తదనంతరం మరళా ప్రత్యేక తెలంగాణ పోరాటంలో ప్రముఖ పాత్రపోషిస్తూ తనదైన ముద్రను తెలంగాణా గడ్డపై సంపాదించుకున్నారు. 2014 సం॥లో తెంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణా రాష్ట్ర రాజకీయాల్లో మంత్రిగా, పార్టీలో ప్రముఖ పాత్రపోషిస్తూ టిఆర్ఎస్ పార్టీకి వెన్నెముకగా నిలుస్తున్నారు. నేడు తెలంగాణాలో అమలుచేస్తున్న ఎన్నో పథకాలతోపాటు చేపట్టిన నూతన సంస్కరణలు అమలు చేయడంలో వీరి పాత్ర ప్రముఖమైనది. హరీష్రావుగారి వ్యక్తిగతజీవితంలోకి వచ్చినట్లైతే శ్రీ టి.హరీష్రావు గారి తల్లి దండ్రులు శ్రీ సత్యనారాయణ, శ్రీమతి టి.లక్ష్మి గార్లు వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. శ్రీ హరీష్రావుగారి తండ్రి వ్యవసాయ కుటుంబము నుండే వచ్చినప్పటికీ, చదువుల తల్లిని ఆశ్రయించడంతో, అంచెలంచెలుగా ఎదిగి సీనియర్ అసిస్టెంట్ డీఎం అండ్ హెచ్ఓ, కరీంనగర్లో పదవీ బాధ్యతలు నిర్వహించారు. వీరి ప్రథమ సంతానమైన శ్రీ టి.హరీష్రావు రాజకీయాలలో చేరి రాణిస్తుంటే, రెండవ కుమారుడైన శ్రీ టి.మహేష్రావు అమెరికా దేశంలో స్థిరపడ్డారు. శ్రీ హరీష్రావు గారు 3.6.1972వ సం.లో కరీంనగర్ జిల్లాలో గల సిద్ధిపేటలో జన్మించారు. ఇంటర్మీడియట్ వరకు అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసుకొని, ఇంజనీరింగ్ చేసేందుకు హైదరాబాద్ వచ్చి విజయవంతంగా పూర్తి చేస్తారు. శ్రీ హరీష్రావుగారు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన శ్రీ మాధవరం హనుమంతరావుగారి కుమార్తె శ్రీనిత గారిని వివాహం చేసుకున్నారు. ఓ సంస్థ వారు నిర్వహించిన అందాల పోటీలో పాల్గొన్న శ్రీనిత గారు మిస్గా ఎంపిక కావడం అనాడు ఒక విశేషం. ఈ దంపతులకు ఒక కుమారుడు. శ్రీ హరీష్రావు ఎప్పుడూ చెరగని చిరునవ్వుతో ప్రతీ ఒక్కరిని పేరు పేరున ఆప్యాయంగా పకలరిస్తూ తనదైన శైలిలో అందరితో అందరిలో ఒకడిగా కలిసిపోతారు. టీఆర్ఎస్ పార్టీ బాధ్యతలను మరియు ప్రభుత్వ బాధ్యతలను ఎంతో హుందాగా నిర్వహిస్తూ చేసే కార్యక్రమాలకు నిండుదనం వచ్చేలా వ్యవహరించి అన్ని ఏర్పాట్లను తనే దగ్గరుండి పర్యవేక్షించి పార్టీ శ్రేణులచే శభాష్ అనిపించుకుంటున్నారు శ్రీ హరీష్రావుగారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవానికి అహర్నిషలు కృషి చేసిన శ్రీ చంద్రశేఖరరావు ఆశయాలకు అనుగుణంగా పార్టీని, ప్రభుత్వాన్ని బలోపేతం చేస్తూ, ప్రజల మనోభావాలకు అద్దంపట్టే విధంగా తమ కార్యక్రమాలను తయారు చేసుకొని ముందుకు సాగిపోతున్న óస్వచ్ఛమైన, అచ్చమైన తెలంగాణ వాది తన్నీరు హరీష్రావు గారు. వేసే ప్రతి అడుగు ఒక నవ్య రీతిలో వేసి సాగిపోతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ తెలంగాణ వెలమజాతి మణిహారంగా నిలుస్తున్నారు శ్రీ హరీష్రావు గారు |