తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కమిటీని శుక్రవారం అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఈ కమిటీలో విశాఖకు చెందిన పలువురు న్యాయవాదులకు చోటు లభించింది. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్, పార్టీ సీనియర్ నేత పీ.ఎస్. నాయుడు నియమితులయ్యారు. గతంలో రాష్ట్ర కమిటీలో పలు హ ోదాల్లో పనిచేసిన నాయుడు నగరంలో సమైక్యాంద్ర ఉద్యమం సమయంలో పాక్టీ నాయకులపై పోలీసులు పెట్టిన అనేక కేసులను వాదించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సేవలందించారు. కాగా లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా ఎస్.వీ. రమణ, సిద్ధార్ధ శ్రీవెంకటేష్, కార్యనిర్వాహక కార్యదర్శిగా వెన్నెల ఈశ్వరరావు, కార్యదర్శిగా సావిలి సతీశ్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా పొట్నూరు కిరణ్‌కుమార్, పల్లా బాలాజీలను నియమించారు. |